: దర్శకుడు శంకర్ నివాసం వద్ద పటిష్ట భద్రత


'ఐ' సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్టార్ డైరక్టర్ శంకర్ కు హిజ్రాల సెగ తగులుతోంది. 'ఐ' చిత్రంలో ట్రాన్స్ జెండర్లను అవమానించారంటూ వారు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో, చెన్నైలోని శంకర్ నివాసం వద్ద పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. దీనిపై శంకర్ సన్నిహితుడొకరు మాట్లాడుతూ, గత రెండ్రోజులుగా ట్రాన్స్ జెండర్లు ఆందోళన చేస్తున్నారని తెలిపారు. దీంతో, శంకర్ పోలీసు రక్షణ కోరారని వివరించారు. కాగా, 'ఐ' సినిమాలో తమను కించపరచడంపై హిజ్రాలు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News