: సల్మాన్ 'హిట్ అండ్ రన్' కేసులో రక్షణ కోరిన ప్రత్యక్ష సాక్షి
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ 'హిట్ అండ్ రన్' కేసులో ప్రత్యక్ష సాక్షి తనకు పోలీసు రక్షణ కల్పించాలని ముంబయి సెషన్స్ కోర్టును ఈ రోజు మౌఖికంగా కోరాడు. అయితే అతను లిఖితపూర్వకంగా కోరితే పరిశీలిస్తామని జడ్జి డీడబ్ల్యూ దేశ్ పాండే తెలిపారు. మరోవైపు, ఈ కేసులో నేటి విచారణకు సల్మాన్ హాజరు కాలేదు. ఆయన తరపు న్యాయవాది శ్రీకాంత్ శివాదె కూడా గైర్హాజరయ్యారు. అనారోగ్యం కారణంగానే శ్రీకాంత్ రాలేకపోయారని డిఫెన్స్ న్యాయవాది తెలిపారు. దాంతో తదుపరి విచారణ ఈ నెల 22కు వాయిదా పడింది.