: రాజీవ్ ప్రతిభా అవార్డుల పేరు మార్పు


రాజీవ్ ప్రతిభా పురస్కారాల పేరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చింది. ఇక నుంచి 'తెలుగు ఆత్మగౌరవ పురస్కారాలు' పేరుతో ఈ అవార్డులను ప్రదానం చేయనుంది. ఈ మేరకు పురస్కారాల పేరు మారుస్తూ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, ఉగాది పండుగ నాడు నంది ఫిల్మ్ అవార్డులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో పాటు అనంతపురంలో నంది టీవీ అవార్డులు, రాజమండ్రిలో నంది నాటక అవార్డులు ప్రదానం చేయాలని కూడా నిర్ణయించింది. 2011 తరువాత నంది సినీ పురస్కారాలు ఇవ్వలేదు.

  • Loading...

More Telugu News