: శారదా స్కాం: సుప్రీంకు వెళ్లిన తృణమూల్ కాంగ్రెస్
శారదా చిట్ ఫండ్ స్కాం విచారణ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితోనే జరుగుతోందని ఆరోపించింది. తక్షణమే కేసులో జోక్యం చేసుకుని పర్యవేక్షించాలని కోరుతూ తృణమూల్ పిటిషన్ వేసింది. కోట్ల రూపాయల ఈ స్కాంతో సంబంధమున్న తృణమూల్ నేత, పశ్చిమ బెంగాల్ మంత్రి మదన్ మిత్రా, పార్టీ ఎంపీ సృంజయ్ బోస్, మాజీ ఎంపీ కునాల్ ఘోష్ లను సీబీఐ అరెస్టు చేసింది. గతంలో సుప్రీం ఇచ్చిన ఆదేశాలతోనే సీబీఐ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే.