: చంద్రబాబు ఆరోగ్యం కోసమని అమెరికాలో పూజలు


ఆరున్నర నెలలుగా అవిశ్రాంత శ్రామికుడిలా పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి ఆరోగ్యం బావుండాలంటూ.. అమెరికాలో ఆయన అభిమానులు పూజలు నిర్వహిస్తున్నారు. మీదపడుతున్న వయసును, అనారోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకని మండుటెండల్లో ఆయన సాగిస్తున్న నడక ప్రస్థానం మరికొద్ది రోజుల్లో ముగియనుంది.

ప్రస్తుతం బాబు పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా బే ఏరియాలోని మిల్ పిటాన్ సత్యనారాయణ స్వామి ఆలయంలో రేపు మధ్యాహ్నం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత భారీ ఎత్తున పాదయాత్ర, బహిరంగ సభ నిర్వహిస్తారు. 'సేవ్ ఆంధ్ర ప్రదేశ్.. సపోర్ట్ చంద్రబాబు' నినాదంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు ఎన్నారై టీడీపీ కార్యకర్తలు వెల్లడించారు.

  • Loading...

More Telugu News