: పాక్, సిరియా నుంచి వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లపై ఐబీ నిఘా
సిరియా వెళ్లేందుకు ప్రయత్నిస్తూ శంషాబాద్ ఎయిర్ పోర్టులో సల్మాన్ మొయినుద్దీన్ పట్టుబడటంతో, ఇంటెలిజెన్స్ బ్యూరో, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాలు అలర్ట్ అయ్యాయి. ఫేస్ బుక్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ద్వారా యువతను ఆకర్షించేందుకు ఉగ్రవాద సంస్థలు యత్నిస్తున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు గ్రహించాయి. దీంతో ఉగ్రవాద శిక్షణ సంస్థలున్న పాకిస్థాన్, ఇరాక్, సిరియా, బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లపై నిఘా ఉంచాలని ఐబీ వర్గాలు నిర్ణయించాయి. ఇప్పటికే దీనికి సంబంధించి రంగం సిద్ధం చేసినట్టు సమాచారం.