: కోరికలు తీరిస్తే టీఆర్ఎస్ లో చేరుతానంటున్న దేశం ఎమ్మెల్యే
తానడిగే కోరికలు తీరిస్తే టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమని రాజేంద్రనగర్ టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అంటున్నారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ.350 కోట్ల నిధుల అవసరముందని చెప్పిన ఆయన ఆ నిధులివ్వాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు ఇంటింటికీ మంజీరా నీటిని సరఫరా చేస్తే తాను తప్పకుండా టీఆర్‌ఎస్‌లో చేరుతానని ఆయన స్పష్టం చేశారు. మూడు నెలల క్రితం సీఎం తనతో మాట్లాడినప్పుడే సమస్యల గురించి తెలిపానని, అవి చేపడితే తప్పకుండా టీఆర్ఎస్ పార్టీలో చేరతానని హామీ ఇచ్చినట్టు వివరించారు.