: కేవలం విధ్వంసాలను చూపేందుకే కెమెరా ఇష్టపడుతోంది: జైట్లీ


కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మీడియా ధోరణులపై నిశిత విమర్శలు చేశారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... కేవలం విధ్వంసాలను చూపేందుకే కెమెరా ఇష్టపడుతోందన్నారు. మంచి కంటే చెడుకే ఎక్కువ ప్రాచుర్యం లభిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మనుషుల కష్టాలు ఇప్పుడు వార్తలుగా రూపుదిద్దుకోవడం లేదని, క్రైమ్, ప్రకృతి విపత్తులను ప్రధాన వార్తలుగా పరిగణిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా వివాదాల కవరేజీకి పెద్దపీట వేస్తున్నారని విమర్శించారు. మీడియా ప్రాధాన్యతలు మారిపోయాయని అన్నారు. టీఆర్పీ కోసం సంచలన వార్తల వెంటపడుతున్నారని విశ్లేషించారు. ప్రస్తుతం ప్రపంచంలో సాంకేతిక విప్లవం నడుస్తోందని, ప్రజలు ఐపాడ్ లు, ట్యాబ్ ల సాయంతో రాత్రి సమయాల్లో పత్రికలు చదువుతున్నారని జైట్లీ వివరించారు. నేటి సమాజంలో మీడియా పాత్ర పెరిగిందని చెప్పారు. దేశంలో మీడియా స్వేచ్ఛకు ఎన్డీయే సర్కారు కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News