: బీజేపీ సీఎం అభ్యర్థిగా కిరణ్‌ బేడీ!: మద్దతు పలికిన ఆర్ఎస్ఎస్


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్‌ బేడీ పోటీ చేయనున్నారని ఆర్ఎస్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. ఆమె అభ్యర్థిత్వానికి తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. మూడు రోజుల క్రితం అమిత్‌షా సమక్షంలో కిరణ్‌ బేడీ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. పార్టీ ఆదేశిస్తే తాను 'ఆప్' అధినేత కేజ్రీవాల్‌ పై పోటీకి సిద్ధమని కూడా ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆమేనంటూ ఆర్ఎస్ఎస్ నేడు ఒక ప్రకటన వెలువరించింది. కాగా, కిరణ్ బేడీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా పేర్కొనడంపై కొందరు సీనియర్ నేతల్లో అసంతృప్తి మొదలైనట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News