: స్మార్ట్ సిటీలు ఎవరికి కావాలి... పట్టెడన్నం పెట్టండి: లక్ష్మీపార్వతి


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాలన చూసి దివంగత ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందని ఆయన సతీమణి లక్ష్మీపార్వతి విమర్శించారు. రాష్ట్రానికి స్మార్ట్ సిటీలు అక్కర్లేదని, పేదలకు పట్టెడన్నం దొరికేలా చూడాలని ఆమె అన్నారు. ఎన్టీఆర్ మరణం తెలుగు ప్రజలకు తీరని లోటని లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన బతికి వుంటే తెలుగుజాతి రెండుగా చీలేది కాదని అభిప్రాయపడ్డారు. తన ఏడు నెలల పాలనలో చంద్రబాబు నాయుడు చేసిందేమీ లేదని విమర్శించారు.

  • Loading...

More Telugu News