: మారని బ్యాటింగ్ తీరు... ప్రేక్షకులు లేక బోరు!


టెస్టు మ్యాచ్ లలో పేలవ ప్రతిభ కనబరిచిన భారత జట్టు ఇంకా తీరును మార్చుకోలేదు. ఆరంభంలో కుదురుకొని ఆడాలన్న ఆలోచన లేకపోవడంతో ఆదిలోనే వికెట్ల పతనం మొదలైంది. ముక్కోణపు సిరీస్ రెండో వన్డేలో భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్లో తొలి ఓవర్ లోనే శిఖర్ ధావన్ కేవలం 2 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్లో ఫించ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 3 పరుగులే. కాగా, ఈ మ్యాచ్ ని ప్రత్యక్షంగా తిలకించేందుకు మైదానానికి వచ్చిన ప్రేక్షకుల సంఖ్య చాలా పలుచగా వుంది. ఇండియా ఆడుతుంటే ప్రపంచంలోని మారుమూల దేశాలకైనా వచ్చి చూసే అభిమానులు ఈ మ్యాచ్ కి ఎందుకో దూరంగా వున్నారు. ప్రస్తుతం భారత జట్టు 4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 27 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News