: ప్రత్యేక రాయలసీమ డిమాండ్ పుట్టుకొచ్చే అవకాశం ఉంది: బీవీ రాఘవులు
నవ్యాంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి అంతా విజయవాడ, విశాఖపట్నంలోనే జరుగుతోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అసహనం వ్యక్తం చేశారు. రాయలసీమపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. లేకపోతే దీని పర్యవసానాలు తీవ్రంగా ఉండవచ్చని... ప్రత్యేక రాయలసీమ డిమాండ్ పుట్టుకొచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. రాయలసీమలో కనీసం ఒక ప్రాజెక్టునైనా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రైతు రుణమాఫీ అనేది ఓ మాయ అని రాఘవులు అన్నారు.