: మనం అమ్మకుంటే ఇండియా మరో దేశంలో కొనుక్కుంటుంది... ఒబామాను హెచ్చరించిన సెనేటర్
మనవరహిత విమానాలను భారత్ కు విక్రయించే విషయంలో ఒబామా ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని అమెరికన్ సెనేటర్ మార్క్ వార్నర్ కోరారు. అమెరికా మానవరహిత ఎయిర్ క్రాఫ్ట్ లను విక్రయించకుంటే మరో దేశంతో ఇండియా డీల్ కుదుర్చుకునే అవకాశాలు వున్నాయని ఆయన హెచ్చరించారు. చాలా దేశాల్లో 'డ్రోన్' టెక్నాలజీ అభివృద్ధి చెందిందని, యూఎస్ ముందడుగు వేయకుంటే నష్టపోతామని ఆయన వివరించారు. భారత్ తో ఒప్పందానికి చాలా దేశాలు ఎదురుచూస్తున్నాయని పేర్కొన్నారు. కాగా, రిపబ్లిక్ దినోత్సవ వేడుకలకు ఒబామాతో పాటు వార్నర్ కూడా ఇండియాకు రానున్నారు.