: నా భర్తను హత్య చేసిన వారిని దేవుడే శిక్షించాడు: పరిటాల సునీత
తన భర్త పరిటాల రవిని హత్య చేసిన వారిని దేవుడే శిక్షించాడని ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత అన్నారు. ఈనెల 24న అనంతపురం జిల్లా వెంకటాపురంలో రవి పదో వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు నేడు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర శాసన సభాపతి కోడెల శివప్రసాద్, ఉప ముఖ్యమంత్రి కే.ఈ.కృష్ణమూర్తి తదితరులు హాజరవుతారని వివరించారు. పరిటాల రవి హత్య కేసు పునర్విచారణపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడతానని ఈ సందర్భంగా సునీత పేర్కొన్నారు.