: విశాఖ ఐఐఎంకు చంద్రబాబు శంకుస్థాపన...హాజరుకానున్న కేంద్ర మంత్రులు
మేనేజ్ మెంట్ విద్యాబోధనలో దేశంలోనే పేరెన్నికగన్న ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం)కు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేడు విశాఖలో శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 13 ఐఐఎంలుండగా, 14వ విద్యాసంస్థగా విశాఖ ఐఐఎం వచ్చే ఏడాది నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఐఐఎంను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖ సమీపంలోని గంభీరంలో స్థలాన్ని ఏపీ సర్కారు కేటాయించగా, విద్యాసంస్థ ఏర్పాటుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసింది. నేటి ఉదయం 11 గంటలకు జరగనున్న శంకుస్థాపనలో చంద్రబాబుతో పాటు కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోకగజపతిరాజు, సుజనాచౌదరి తదితరులు పాల్గొననున్నారు.