: ఐఎస్ ఆకర్షితుడు సల్మాన్ మొయినుద్దీన్ కు రెండు వారాల రిమాండ్!


ఇంజినీరింగ్ లో ఉన్నత విద్యనభ్యసించి నిషేధిత తీవ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ లో చేరేందుకు వెళుతున్న హైదరాబాదీ సల్మాన్ మొయినుద్దీన్ కు రాజేంద్రనగర్ లోని ఎనిమిదో మెట్రోపాలిటన్ కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. గుట్టుచప్పుడు కాకుండా టర్కీ వెళ్లి అక్కడి నుంచి సిరియా వెళ్లాలని మొయినుద్దీన్ పక్కాగా పథకం వేసుకున్న సంగతి తెలిసిందే. ఇంటర్నెట్ లో అతడి ఉగ్రవాద కార్యకలాపాలపై నిఘా వేసిన తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు సకాలంలో అప్రమత్తమై, టర్కీ బయలుదేరిన అతడిని నిన్న శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి పలు కీలక అంశాలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు సేకరించినట్లు సమాచారం. హైదరాబాదులో ఉండగా పలువురు యువకులను మొయినుద్దీన్ ఆకర్షించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దిశగా పూర్తి స్థాయి వివరాలు రాబట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News