: ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన లాలూ


ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఎట్టకేలకు ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు 2002లో లాలూకు తుగ్లక్ రోడ్డులోని బంగ్లాను కేటాయించారు. దాణా కుంభకోణంలో దోషిగా రుజువైన తర్వాత బంగ్లాను వెనక్కి తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. 2013లో దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. కానీ, లాలూ మాత్రం బంగ్లాను ఖాళీ చేయలేదు. దీంతో, గడువును పొడిగిస్తూ 2014 వరకు ఆయన బంగ్లాలో ఉండవచ్చని కేబినెట్ కమిటీ తీర్మానించింది. ఈ గడువు పూర్తైన తర్వాత కూడా లాలు బంగ్లాను ఖాళీ చేయలేదు. దీంతో, గత నవంబర్ లో లాలూకు మళ్లీ నోటీసులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో, గత మంగళవారం లాలూ ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసినట్టు కేంద్ర హోంశాఖ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News