: చంద్రబాబు ఢిల్లీలో తిరుగుతుంటే... కేసీఆర్ మాత్రం నిద్రపోతున్నారు: షబ్బీర్ అలీ


రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా ఏందో చూపుతామని టీకాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. రబీ సీజన్ లో వ్యవసాయానికి ఎన్ని గంటల పాటు విద్యుత్ ఇస్తారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సమస్యలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని అన్నారు. తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన విద్యుత్ వాటాను ఇవ్వకుండా... చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు ఢిల్లీలో తిరుగుతుంటే... తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం రాష్ట్రానికి రావాల్సిన హక్కులను అడగకుండా నిద్రపోతున్నారని దుయ్యబట్టారు. ఇదే సమయంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిపై కూడా షబ్బీర్ అలీ మండిపడ్డారు. తెలంగాణ సమస్యలు వెంకయ్యకు కనపడటం లేదా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News