: ఆలౌట్ అయిన ఇంగ్లండ్... ఆసీస్ బ్యాటింగ్ ప్రారంభం
ఆస్ట్రేలియాలో జరుగుతున్న ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఈ రోజు ఆసీస్, ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 234 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ మోర్గాన్ 136 బంతుల్లో 121 పరుగులు చేయడంతో... ఇంగ్లండ్ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. మిగిలిన వారిలో బట్లర్ 28, అలి 22, జోర్డాన్ 17, బొపార 13, రూట్ 5 పరుగులు చేశారు. ముగ్గురు బ్యాట్స్ మెన్ డకౌట్ అయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 4 వికెట్లు తీసి ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్లకు చుక్కలు చూపించగా... ఫాల్కనర్ 3, మ్యాక్స్ వెల్, దోహర్టి, కమ్మిన్స్ లు చెరో వికెట్ తీశారు. అనంతరం ఆసీస్ బ్యాటింగ్ ప్రారంభించింది. వార్నర్ (5), ఫించ్ (5) క్రీజులో ఉన్నారు.