: ఖైదీలతో వెళుతున్న బస్సును ఢీకొన్న గూడ్స్ రైలు... పది మంది మృతి
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది ఖైదీలు, ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు మృతి చెందారు. జాతీయ రహదారిపై మంచు పేరుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. రోడ్డు పక్కనే రైలు మార్గం ఉండటంతో, మంచు కారణంగా అదుపుతప్పిన బస్సు పక్కనే వెళుతున్న గూడ్స్ రైలును బలంగా ఢీ కొట్టింది. బస్సులో సీట్ బెల్టులు లేవని, ఖైదీలకు సంకెళ్లు వేసివున్నాయని అధికారులు తెలిపారు. కొందరు ఖైదీలు ప్రాణాలతో బయటపడ్డారని పేర్కొన్నారు. 58 బోగీలతో వెళుతున్న గూడ్స్ రైలుకు మాత్రం నష్టమేమి జరగలేదు.