: ప్రాంతీయ పార్టీలపై అణచివేత ధోరణి సరికాదు: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ


ప్రాంతీయ పార్టీలపై జాతీయ పార్టీలు అణచివేత ధోరణి అవలంబిస్తున్నాయని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలపై అణచివేత ధోరణి సరికాదని ఆమె వ్యాఖ్యానించారు. పార్టీ నేత, పశ్చిమ బెంగాల్ మంత్రి మంజుల్ కృష్ణ ఠాకూర్ నేటి సాయంత్రం తృణమూల్ కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. మంత్రి పదవిలో ఉన్నా, ఆయన తన పదవితో పాటు పార్టీకీ రాజీనామా చేయడం మమతను ఆశ్చర్యానికి గురి చేసింది. ఠాకూర్ రాజీనామా నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన దీదీ, బీజేపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతల ప్రోద్బలంతోనే ఠాకూర్ తృణమూల్ కాంగ్రెస్ కు రాజీనామా చేశారని ఆమె భావిస్తున్నారు. బీజేపీ పేరును ప్రస్తావించకుండానే మమత జాతీయ పార్టీల పేరిట ఆ పార్టీ నేతల వైఖరిని ఎండగట్టారు.

  • Loading...

More Telugu News