: భారత పాఠశాలలపై ఉగ్రదాడులకు అవకాశం: సైన్యం హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన సందర్భంగా ఇండియాలోని పాఠశాలలపై ఉగ్రవాదులు దాడులు చేసే ప్రమాదముందని లెఫ్టినెంట్ జనరల్ కే.హెచ్.సింగ్ హెచ్చరించారు. సుమారు 200 మంది చొరబాటుదారులు సరిహద్దుల వెంబడి మోహరించారని, వీరంతా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. సైన్యం అనుక్షణం అప్రమత్తంగా ఉందని, ఎటువంటి చొరబాట్లు జరగకుండా చూసుకుంటామని ఆయన తెలిపారు. పాకిస్తాన్ 44 ఉగ్రవాద శిక్షణా శిబిరాలు నిర్వహిస్తోందని, వాటిల్లో 18 వరకూ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో వున్నాయని మరో ఉన్నతాధికారి వివరించారు.