: బాసరలో భక్తుల కిటకిట... తిరుమలలో తగ్గిన రద్దీ
సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. అమ్మవారి దర్శనానికి తెల్లవారుజామునుంచే భక్తులు బారులు తీరారు. మహారాష్ట్ర నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటున్నారు. కాగా, తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా వుంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 5 కంపార్ట్ మెంట్లు నిండాయి. వీరికి 4 నుంచి 5 గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఆర్జిత సేవల్లో బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణసేవ, వసంతోత్సవం టికెట్లు లభిస్తున్నాయి.