: బార్లో దమ్ముకొట్టినా జరిమానా... హోటళ్లు, రెస్టారెంట్లలో స్మోకింగ్ జోన్ల ఎత్తివేత!


కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా ప్రతిపాదనలు అమలులోకి వస్తే బార్లో కూర్చుని మందు కొడుతూ, ధూమపానం చేసినా జరిమానా పడుతుంది. బార్లు సహా హోటళ్లు, రెస్టారెంట్లలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయాలని, అతిక్రమిస్తే రూ.1000 జరిమానా విధించాలని కేంద్రం రూపొందించిన 'పొగాకు ఉత్పత్తులపై నిబంధనల సవరణ బిల్లు-2015' సూచిస్తోంది. ధూమపానీయుల కనిష్ఠ వయోపరిమితిని 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు, కొన్నాళ్ళ తరువాత దాన్ని 25 ఏళ్ల వరకూ పెంచాలని కూడా ప్రతిపాదించింది. అయితే, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో స్మోకింగ్ జోన్ల ఏర్పాటును మాత్రం బిల్లు అనుమతిస్తోంది.

  • Loading...

More Telugu News