: బాలయ్య రాకతో నిమ్మకూరు సంక్రాంతి వేడుకలకు కొత్త ఉత్సాహం


హిందూపురం ఎమ్మెల్యే, టాలీవుడ్ ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ చేరికతో ఆయన సొంతూరు నిమ్మకూరులో సంక్రాంతి వేడుకలకు కొత్త ఉత్సాహం వచ్చేసింది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయన విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని, అక్కడినుంచి ఆయన రోడ్డు మార్గం మీదుగా నిమ్మకూరు చేరుకున్నారు. కుటుంబ సమేతంగా నిమ్మకూరుకు వచ్చిన బాలయ్య సంక్రాంతిని పురస్కరించుకుని మూడు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. సంక్రాంతి వేడుకలకు బాలయ్య వస్తున్నారన్న సమాచారంతో నిమ్మకూరు వాసులు భారీ ఏర్పాట్లు చేశారు. వచ్చీరాగానే తన తల్లిదండ్రులు ఎన్టీ రామారావు, బసవతారకం విగ్రహాలకు నివాళులర్పించిన బాలయ్య వేడుకలను ప్రారంభించారు.

  • Loading...

More Telugu News