: పాతాళానికి పడిపోయిన ముడిచమురు ధర... పది రూపాయలకు పైగా తగ్గనున్న పెట్రోల్ ధర!


అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర పాతాళానికి దిగజారింది. లండన్ కమోడిటీ మార్కెట్లో బ్యారల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర ఆరేళ్ళ కనిష్ఠ స్థాయికి చేరి 45 డాలర్లకు తగ్గింది. మార్చి 2009 తరువాత ముడిచమురు ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. గత సంవత్సరం జూన్ లో 115 డాలర్ల వద్ద ఉన్న క్రూడాయిల్ ధర 60 శాతానికి పైగా తగ్గింది. ముడిచమురు ధరలు మరింత దిగజారి 30 డాలర్ల స్థాయిని తాకవచ్చని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ గోల్డ్‌ మన్ శాక్స్ అంచనా వేస్తోంది. కాగా, పక్షం రోజుల వ్యవధిలో ముడిచమురు ధర 20 శాతానికి పైగా తగ్గడంతో, ఈ దఫా ప్రభుత్వరంగ చమురు సంస్థలు లీటర్ పెట్రోల్ ధరను రూ.10కి పైగా తగ్గించే వెసులుబాటు ఉంది. ప్రజలకు ఏ మేరకు లబ్ధి చేకూరుతుందన్నది మరో రెండు రోజుల్లో తేలనుంది.

  • Loading...

More Telugu News