: ప్రత్యేక రైళ్లలో విద్యార్థులకు అరవై శాతం రాయితీ


దేశవ్యాప్తంగా ఐఆర్‌సీటీసీ నడిపే ప్రత్యేక రైళ్లలో విద్యార్థులకు 60 శాతం రాయితీ ఇవ్వాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు తెలిపారు. స్లీపర్ క్లాస్, సెకెండ్‌క్లాస్, జనరల్ బోగీల్లో ఈ రాయితీ డిసెంబర్ 14 వరకు అమలులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం విద్యార్థులు గుర్తింపు పొందిన స్కూల్, కాలేజీ, ఇతర విద్యా సంస్థల నుంచి ధ్రువీకరణ పత్రాన్ని టికెట్ కౌంటర్ లో అందించి టికెట్లు బుక్ చేసుకోవచ్చని వివరించారు. టూరిజం ప్యాకేజీ ఉన్న రైళ్లకు మాత్రం మినహాయింపు ఉండదని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News