: హైదరాబాదులో దొంగల స్వైర విహారం... పహాడీ షరీఫ్ లో ఐదిళ్లలో చోరీ
ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు సంక్రాంతి సంబరాల్లో మునిగితేలుతుంటే, హైదరాబాదులో దొంగలు స్వైర విహారం చేశారు. నగరంలోని పహాడీ షరీఫ్ పరిధిలోని డ్రీమ్ కాలనీలో దొంగలు ఐదిళ్లలో చోరీకి పాల్పడ్డారు. ఈ చోరీల్లో 30 తులాల బంగారం, రూ.2 లక్షల మేర నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. ఒకే ముఠాకు చెందిన దొంగలు పాల్పడినట్లుగా భావిస్తున్న ఈ దొంగతనాలపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు చోరుల కోసం గాలింపు చేపట్టారు.