: కోడిపందాలపై పోలీసుల దాడులు... రాజమండ్రిలో పన్నెండు మంది అరెస్ట్


సంక్రాంతి సంబరాల్లో భాగంగా జరుగుతున్న కోడిపందాలపై పోలీసులు దాడులు ప్రారంభించారు. కోడిపందాలు నిర్వహించుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పినా వినని పోలీసులు తమదైన రీతిలో దాడులు కొనసాగిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం నరేంద్రపురంలో జరుగుతున్న కోడిపందాలపై దాడులు చేసిన పోలీసులు 12 మంది పందెంరాయుళ్లను అరెస్ట్ చేసి, పందాలకు సిద్ధంగా ఉన్న ఆరు కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో తమకు సంబంధం లేదని చెబుతున్న పోలీసులు హైకోర్టు మార్గదర్శకాలనే తాము పాటిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోడిపందాలపై దాడులు కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News