: నా భార్య హంతకులెవరో తెలిస్తే వెల్లడించండి: సుబ్రహ్మణ్య స్వామిపై శశి థరూర్ ఫైర్
బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత శశి థరూర్ విరుచుకుపడ్డారు. తన భార్య సునంద పుష్కర్ మృతిపై స్వామి చేస్తున్న వరుస ప్రకటనలపై థరూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సునంద కేసులో సుబ్రహ్మణ్య స్వామి చేస్తున్న ప్రకటనల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన కొద్దిసేపటి క్రితం వ్యాఖ్యానించారు. అసలు సునంద హత్యలో పాత్ర ఉన్న వారి పేర్లు తెలిస్తే బయటపెట్టాలని ఆయన స్వామికి సవాల్ విసిరారు. అనవసర రాద్ధాంతం చేస్తున్న స్వామి ఇకనైనా నోరు కట్టేసుకోవాలని థరూర్ సూచించారు.