: కంటోన్మెంట్ లో సాయన్న హవాకు చెక్... టీఆర్ఎస్ చేతిలో కూతురు పరాజయం!


కంటోన్మెంట్ లో రెండు దశాబ్దాలుగా చక్రం తిప్పుతూ వస్తున్న టీడీపీ ఎమ్మెల్యే సాయన్నకు తాజా ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో భాగంగా నాలుగో వార్డు నుంచి బరిలోకి దిగిన సాయన్న కూతురు లాస్య నందిత ఓటమిపాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి నిళిని కిరణ్ చేతిలో ఆమె 844 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కంటోన్మెంట్ బోర్డు చైర్మన్ గానూ పనిచేసిన సాయన్న, ప్రస్తుతం కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గతంలోనూ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ గాలికి ఎదురొడ్డి గెలిచారు. అయితే తాజా బోర్డు ఎన్నికల్లో టీడీపీతో పాటు సాయన్నకూ కంటోన్మెంట్ ప్రజలు గట్టి షాకిచ్చారు.

  • Loading...

More Telugu News