: చంద్రబాబు ఏజెంట్ల సత్తా తెలిసింది: తలసాని


సనత్ నగర్ ఉపఎన్నికల్లో తేల్చుకుందామని చెప్పిన చంద్రబాబు ఏజెంట్ల సత్తా తెలిసిందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, టీడీపీ బలమేంటో కంటోన్మెంట్ ఎన్నికల్లో తేలిపోయిందని అన్నారు. టీడీపీతో తాడోపేడో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తేల్చుకుంటానని ఆయన సవాలు విసిరారు. సనత్ నగర్ వరకు ఎందుకు, త్వరలో జరుగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ పత్తాలేకుండా పోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ లో టీఆర్ఎస్ సత్తా చూపిందని ఆయన తెలిపారు. కంటోన్మెంట్ ఛైర్మన్ ఎవరన్నది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని తలసాని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News