: వీబీకి నివాళి అర్పించిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు


ప్రముఖ దర్శక నిర్మాత వీబీ రాజేంద్రప్రసాద్ మృత దేహానికి నివాళి అర్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు భారీ సంఖ్యలో ఆయన నివాసం వద్దకు చేరుకుంటున్నారు. ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు వీబీకి నివాళి అర్పించారు. సినీ నటులు మోహన్ బాబు, వెంకటేష్, సుశాంత్, మురళీమోహన్, జయసుధ నిర్మాతలు సురేష్ బాబు, రమేష్ ప్రసాద్, అచ్చిరెడ్డి, దర్శకులు రాఘవేంద్రరావు, వి.వి.వినాయక్, ఎస్వీ కృష్ణారెడ్డి, శ్యాంప్రసాద్ రెడ్డి, రచయిత పరుచూరి గోపాలకృష్ణ తదితరులు రాజేంద్రప్రసాద్ భౌతికకాయాన్ని దర్శించుకుని నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వీరంతా వీబీతో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News