: ఈనెలలో దావోస్ వెళుతున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 21 నుంచి 24 వరకు దావోస్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా, ఆయన ప్రపంచ వాణిజ్య సదస్సులో పాల్గొంటారు. ఢిల్లీలో ఈరోజు భారత్-ఆస్ట్రేలియా వాణిజ్య సదస్సులో పాల్గొన్న అనంతరం చంద్రబాబు హైదరాబాద్ తిరిగివచ్చారు. ప్రయాణ సమయంలో జపాన్ బృందంతో సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు, రాజధాని నిర్మాణం తదితర అంశాలపై వారితో చర్చించారు.