: ఎన్నారైలకు ఈ- ఓటింగ్: ఎనిమిది వారాల్లో అమలు చేయాలన్న సుప్రీంకోర్టు


విదేశాల్లో ఉంటూ దేశ ఎన్నికల్లో పాలుపంచుకోలేకపోతున్నామని మధనపడుతున్న ప్రవాస భారతీయులకు ఊరట కలిగిస్తూ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రవాస భారతీయులకు ఎన్నికల్లో అవకాశం కల్పించే దిశగా కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. ప్రవాస భారతీయులకు ఈ-ఓటింగ్ ద్వారా ఎన్నికల్లో పాలుపంచుకునే అవకాశం కల్పించాలని అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఎనిమిది వారాల్లోగా ఈ-ఓటింగ్ కు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని నిర్దేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News