: రామోజీ ఫిలిం సిటీ భూములపై మాట మారుస్తున్న కేసీఆర్ : టీపీసీపీ చీఫ్ పొన్నాల ధ్వజం
రామోజీ ఫిలిం సిటీ భూములపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట మారుస్తున్నారని టీపీసీసీ చీఫ్ పొన్నాల ఆరోపించారు. గతంలో ఫిలిం సిటీ భూములపై మాట్లాడిన దానికి కేసీఆర్ విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్ మాట మారుస్తున్నారని కొందరు టీఆర్ఎస్ నేతలే అంగీకరిస్తున్నారని ఆయన తెలిపారు. గతంలో చేసిన ప్రకటనలకు విరుద్ధ వ్యాఖ్యలు చేస్తూనే, తాను మాట తప్పే మనిషిని కానంటూ చెప్పుకోవడం ఒక్క కేసీఆర్ కే చెల్లిందని పొన్నాల ధ్వజమెత్తారు. రామోజీ ఫిలిం సిటీ భూముల వివాదంపై హైకోర్టులో కేసు నడుస్తోందని పొన్నాల వివరించారు.