: టీడీపీ నేత, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ అరెస్ట్
తెలుగు దేశం పార్టీకి ఆదిలాబాద్ జిల్లాలో నేడు గట్టి దెబ్బ తగిలింది. జిల్లాలో పార్టీకి కీలక నేతగా వ్యవహరిస్తున్న మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ అరెస్టయ్యారు. నేటి ఉదయం ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే రేఖా నాయక్ గన్ మెన్ పై దాడికి దిగిన రమేశ్ రాథోడ్ పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లాలోని కడెం రోడ్డులో ప్రమాద బాధితులను రేఖా నాయక్ పరామర్శించారు. ఈ సందర్భంగా అక్కడి వచ్చిన రమేశ్ రాథోడ్, ఎమ్మెల్యే గన్ మన్ పై దాడి చేశారు. దీనిపై రేఖా నాయక్ ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అరెస్ట్ విషయంలో రెండు రోజులుగా తటపటాయించిన పోలీసులు ఎట్టకేలకు నేటి ఉదయం ఆయనను అరెస్ట్ చేసి నిర్మల్ కోర్టులో హాజరుపరిచారు.