: రామోజీ ఫిలింసిటీలో ఆక్రమణ భూమి అంగుళం కూడా లేదు: కేసీఆర్


రామోజీ ఫిలింసిటీలో ఆక్రమణ భూమి అంగుళం కూడా లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రామోజీ ఫిలిం సిటీని వివాదం చేస్తే తాను ఫిలిం సిటీకి వెళ్లానని అన్నారు. అసైన్డ్ భూమి గురించి రామోజీరావును వివరాలు అడిగానని చెప్పిన ఆయన, రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక్క కుంట కూడా అసైన్డ్ భూమి లేదని ఆయన తెలిపారు. ఫిలిం సిటీలో ప్రతి అంగుళం రామోజీరావు కొనుగోలు చేసిందేనని అన్నారు. ప్రభుత్వం అంగుళం భూమి కూడా సేకరించి ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీని లక్షనాగళ్ళతో దున్నుతానని తానెప్పుడూ అనలేదని కేసీఆర్ తెలిపారు. రామోజీ ఫిల్మ్ సిటీలో భూ కబ్జా జరిగిందని తానెప్పుడూ చెప్పలేదని స్పష్టం చేసిన కేసీఆర్, ఆ వ్యాఖ్యలన్నీ మీడియా సృష్టేనని వెల్లడించారు.

  • Loading...

More Telugu News