: నాకు మహాసిగ్గు...ఏకాంతంగా ఉండడం ఇష్టం: ప్రియాంక చోప్రా


కెమెరా ముందు బికినీలాంటి డ్రెస్సుల్లో అందచందాలు ఒలకబోసే ప్రియాంక చోప్రా అదంతా కెమేరా వరకే అంటోంది. వ్యక్తిగత జీవితంలో తానెంతో సిగ్గరినని చెబుతోంది. ముంబైలో మాట్లాడుతూ, సినీ నటులుగా స్టార్ జీవితాన్ని అనుభవిస్తామని, విలాసవంతమైన జీవితం గడుపుతామని జనాలు భావిస్తారని, నిజానికి అది అపోహ అని స్పష్టం చేసింది. తనకు చాలా సిగ్గని ప్రియాంక తెలిపింది. తనకు ఏకాంత జీవితం అంటే చాలా ఇష్టమని చెప్పింది. కంఫర్ట్ జోన్ లో ఉండాలని భావిస్తానని ప్రియాంక చెప్పింది. అందుకే తాను స్టార్ అని ఫీల్ కానని, అలా ఫీలవడం తనకు పెద్దగా ఇష్టం ఉండదని పీసీ పేర్కొంది. అయితే తానీ స్ధాయికి రావడానికి, స్టార్ గా రూపొందడానికి ఎంతో కష్టపడ్డానని పీసీ తెలిపింది.

  • Loading...

More Telugu News