: గుజరాత్ లో రూ. లక్ష కోట్ల పెట్టుబడులు పెడతాం: ముఖేష్ అంబానీ
ప్రపంచంలో భారత్ అన్ని విధాలా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అన్నారు. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా కార్యక్రమాలు భారత్ బలాన్ని అమాంతం పెంచేశాయని తెలిపారు. ఉజ్వల గుజరాత్ సదస్సు ప్రతి ఏటా విజయవంతం అవుతోందని... ఈ సదస్సులో పాల్గొనడం తన అదృష్టమని చెప్పారు. రానున్న రోజుల్లో గుజరాత్ లో రూ. లక్ష కోట్ల పెట్టుబడులు పెడతామని స్పష్టం చేశారు. గుజరాత్ గాంధీనగర్ లో జరుగుతున్న 'ఉజ్వల గుజరాత్' సదస్సుకు హాజరైన ముఖేష్ అంబానీ... సదస్సులో ప్రసంగిస్తూ పైవిధంగా వ్యాఖ్యానించారు. ఫ్యూచర్ ఓరియంటెడ్ స్టేట్ గా గుజరాత్ అవతరిస్తుందని ముఖేష్ అభిప్రాయపడ్డారు. దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా గుజరాత్ ను కొనియాడారు. భారతదేశంలో వ్యాపారానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని... పేరుగాంచిన సంస్థలన్నీ భారత్ లో పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా ముఖేష్ పిలుపునిచ్చారు.