: కేసీఆర్ చెప్పిన పవర్ ప్లాంట్లకు కేంద్ర అనుమతులు లేవు: రేవంత్ రెడ్డి ఫైర్
తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న అబద్ధాలకు అంతేలేదని... ఆకాశమే హద్దుగా అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి 7 నెలలైనా విద్యుత్ సమస్యను పరిష్కరించలేకపోయారని... ప్రభుత్వ విధానాలతో రైతులు నానా కష్టాలు పడుతున్నారని విమర్శించారు. కేవలం మున్సిపల్ ఎన్నికలలో విజయం సాధించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ పర్యటన చేపట్టారని రేవంత్ మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని... అయితే, వాటికి కేంద్ర ప్రభుత్వ అనుమతులు లేవని చెప్పారు. రోజుకో అబద్ధం చెబుతూ కేసీఆర్ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు.