: అలిపిరి వద్ద ఢీకొన్న రెండు బస్సులు... ముప్పైఆరు మందికి గాయాలు


అలిపిరి నుంచి తిరుమల వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. ముందు వెళుతున్న ఓ ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో 36 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటీన తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిని గుజరాత్ లోని రాజ్ కోట్, సూరత్ ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. వెనుక నుంచి వచ్చిన బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News