: పెంచలేకపోతున్నానంటూ పిల్లలను అమ్మకానికి పెట్టిన తల్లి


నవ మాసాలు మోసి పెంచిన తల్లి తన పిల్లలను అమ్మకానికి పెట్టింది. హైదరాబాదులోని కూకట్ పల్లి వివేకానంద నగర్ లో ఉంటున్న చందు-విజయ దంపతులకు ఆరుగురు సంతానం. వీరిని పోషించే స్థోమత లేక వారిని అమ్మేయాలని నిర్ణయించింది. దీంతో ఆరుగురు పిల్లలను తీసుకుని కూకట్ పల్లిలోని బస్టాండ్ కు వచ్చింది. ఎవరైనా సాకేవాళ్లుంటే తమ పిల్లలను దత్తత ఇస్తానంటూ అక్కడి వారిని అడిగింది. ఆ విషయం ఆ నోటా, ఈ నోటా పాకి చివరకు పోలీసులకు చేరింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని పిల్లలను పాస్టర్ శామ్యూల్ అనాధాశ్రమానికి తరలించారు. అనంతరం పిల్లలను శిశుసంక్షేమాధికారులకు సంరక్షణ కోసం పోలీసులు అప్పగించారు.

  • Loading...

More Telugu News