: ఆంధ్రాబ్యాంకు సేవలు వినియోగించుకుంటాం: కేటీఆర్
తెలంగాణ రైతులకు ఆంధ్రా బ్యాంకు సేవలు వినియోగించుకుంటామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాదులోని గచ్చిబౌలి నానక్ రామ్ గూడలో ఆంధ్రా బ్యాంకు నూతన శాఖలను మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు గ్రీన్ హౌస్, సోలార్ పంపు సెట్లు, వ్యవసాయ రుణాలపై బ్యాంకు అధికారులతో చర్చిస్తున్నామని ఆయన చెప్పారు.