: ఫిలింసిటీ నిర్మిస్తే తెలంగాణలో ఆత్మహత్యలు ఆగవు: స్వామి అగ్నివేశ్


తెలంగాణలో ఫిలింసిటీ నిర్మిస్తామంటూ పలుసార్లు ప్రకటనలు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ చురకంటించారు. ఫిలింసిటీ నిర్మిస్తే తెలంగాణలో ఆత్మహత్యలు ఆగవని అన్నారు. వారికి సరైన దారి చూపించిన నాడే పరిష్కారమని చెప్పారు. హైదరాబాదు పబ్లిక్ గార్డెన్స్ లో ఈరోజు జరిగిన 'తెలంగాణ విద్యావంతుల వేదిక' ఐదవ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అగ్నివేశ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాలని సూచించారు.

  • Loading...

More Telugu News