: ‘గోపాల గోపాల’పై సైఫాబాద్ పీఎస్ లో ఫిర్యాదు!
టాలీవుడ్ మల్టీ స్టారర్ చిత్రం ‘గోపాల గోపాల’పై హైదరాబాదులోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు అందింది. హిందువుల మనోభావాలను కించపరిచేలా సదరు చిత్రం ఉందంటూ రఘునాథరావు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేశ్ లు ఈ చిత్రంలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై ఇదివరకే విశ్వ హిందూ పరిషత్ ఆందోళన చేపట్టింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఆ చిత్రానికి సర్టిఫికెట్ ను మంజూరు చేయరాదంటూ వీహెచ్ పీ కార్యకర్తలు సెన్సార్ బోర్డు కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఇదిలా ఉంటే, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నేటి ఉదయం విడుదలైంది. విడుదలైన కొన్ని గంటల్లోనే సదరు చిత్రంపై పోలీసులకు పిర్యాదు అందడం గమనార్హం.