: జగన్ ను ప్రజలు సీఎంగా ఒప్పుకోరు: ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని


వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తెలుగు ప్రజలు సీఎంగా ఒప్పుకోరని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. సీఎం కావాలన్న జగన్ కల నెరవేరదని ఆయన తేల్చిచెప్పారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన అచ్చెన్నాయుడు, జగన్ వ్యవహార సరళిపై విమర్శలు గుప్పించారు. ఏపీకి సీఎంనవుతానంటూ జగన్ పగటి కలలు కంటున్నారని మరో మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఎద్దేవా చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్లకు పడగలెత్తిన జగన్, తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News