: దేశంలో నైపుణ్యాభివృద్ధి జరగాలి: అమిత్ షా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని బీజేపీ నిర్వహించిన భారీ సభలో ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ప్రసంగించారు. దేశంలో నైపుణ్యం పెంపొందాలని అన్నారు. నైపుణ్యాభివృద్ధి కోసం ప్రధాని మోదీ ఏకంగా ఓ మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేశారనన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పట్టారని, ఆ తర్వాత జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ముగ్గురు సీఎం పీఠం ఎక్కారని తెలిపారు. తమ పార్టీ జమ్మూకాశ్మీర్లో మునుపెన్నడూలేని విధంగా సీట్లను గెలుచుకుందని చెప్పారు. 2014 బీజేపీ విజయనామ సంవత్సరంగా నిలిచిపోతుందని అన్నారు. 'మేక్ ఇన్ ఇండియా' నినాదంతో నిరుద్యోగాన్ని పారదోలతామని యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు అమిత్ షా.