: కొత్తవలస పోలీస్ స్టేషన్ పై యూదుబాబా అనుచరుల దాడి... పోలీసులకు గాయాలు
విజయనగరం జిల్లా కొత్తవలస పోలీస్ స్టేషన్ పై యూదుబాబా దయాసాగర్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఆధ్యాత్మికత పేరిట మహిళలను లోబరుచుకున్న యూదుబాబా అకృత్యాలపై ఓ మహిళ ఫిర్యాదు నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు దయాసాగర్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, దయాసాగర్ ను తక్షణమే విడిచిపెట్టాలని అతడి అనుచరులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసిన బాబా అనుచరులు ఆ తర్వాత పోలీస్ స్టేషన్ పై విరుచుకుపడ్డారు. ఈ దాడిలో పలువురు పోలీసులకు గాయాలైనట్లు సమాచారం. దాడి నేపథ్యంలో బాబా అనుచరగణంపై దృష్టి సారించిన పోలీసులు, రౌడీషీటర్ నల్లం వాసును కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.