: ఏపీ సీఎంతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదాకు సంబంధించి ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. త్వరలోనే ఏపీకి ప్రత్యేక హోదాను ప్రకటిస్తామని గతంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన సంగతి తెలిసిందే. అంతేగాక, రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాలకు కేంద్రం నుంచి విడుదల కావాల్సిన వివిధ ప్రోత్సాహకాలు, రాయితీలు, అదనపు నిధుల కేటాయింపులకు సంబంధించిన కేంద్ర మంత్రుల కమిటీలో నిర్మలా సీతారామన్ కీలక భూమిక పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో ఆమె భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.